‘‘నీకు ఏం పని లేదా’’.. మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్..!

by Satheesh |   ( Updated:2023-04-27 14:52:03.0  )
‘‘నీకు ఏం పని లేదా’’.. మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిన పోయే వాళ్లు రాళ్లు వేస్తే స్పందిస్తారా.. నీకు ఏం పని లేదా అని కేసీఆర్ ఫైర్ అయినట్లు సమాచారం. తలకాయ లేని వాళ్లు ఎన్నో మాట్లాడుతారని.. అలాంటి వాళ్లు విమర్శలు చేశారని కౌంటర్‌గా ప్రెస్ మీట్ పెడతారా కేసీఆర్ సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీ పని నువ్వు చేసుకోవాలని.. ఎవరి మీద ఎవరు మాట్లాడిన పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రికి సూచించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఇటీవల బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో భారీగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించగా.. దానికి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ రావుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య విమర్శలు, సవాళ్ల పర్వం నడిచింది. ఈ ఇష్యూ వల్లే తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Also Read..

ఆ ఎమ్మెల్యేలకు ఇదే లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీటైతే..: సీఎం కేసీఆర్ సీరియస్

‘‘పార్టీనే ముఖ్యం’’.. కడియం, రాజయ్యలకు సీఎం KCR వార్నింగ్!

Advertisement

Next Story