- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kishan Reddy : రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించారని.. కాంగ్రెస్ ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా స్వస్థి చెబుతారన్నారు. నిరుద్యోగులకు మేలు చేస్తామని ప్రమాణం చేసి హామీలను విస్మరించారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విస్తారంగా అవినీతి కొనసాగుతోందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రమే రాష్ట్రంలో మార్పు వచ్చిందని సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును కాలరాసి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని.. రాష్ట్రంలో కేవలం పార్టీ జెండా మాత్రమే మారిందన్నారు. ప్రజావాణి వినిపించడంలో బీజేపీ కృషి చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విషయమే మర్చిపోయారన్నారు.