- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల కదలికలపై సీబీఐ ఆరా

దిశ,తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు, న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావుల కదిలికలపై సీబీఐ నిఘా ఉంచడంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులు దేశాలు మారి తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ చెబుతోంది. బెల్జియంలో శ్రవణరావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం లభించిందని వెల్లడిస్తున్నారు. కీలక నిందితులుగా ఉన్న ఇరువురుని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుపుతున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్ పోల్ కు చెరడంతో 196 దేశాల ప్రతినిధులను ఇంటరోపోల్ అప్రమత్తం చేయనున్నట్లు సమాచారం.
అచూకి తెలియాగానే ఏ క్షణంలోనైనా వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలపుతున్నారు. ఇటీవల కాలంలో శ్రవణ్ రావు ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం పలుమార్లు హైకోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని శ్రవణరావుపై ఆరోపణలు ఉన్నాయి. శ్రవణ్ రావు కూడా మొదట యూకేకు వెళ్లీ అక్కడ నుంచి అమెరికా వెళ్ళినట్లు పోలీసులు తెలుపుతున్నారు. తాజాగా బెల్జీయం చెరుకున్నాడని సమాచారం అందిదని హైదరాబాద్ పోలీసులు కూడా దృవీకరించారు.