- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : మేడిగడ్డ డ్రోన్ ఘటన.. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై కేసు విచారణ వాయిదా
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ పర్యటనలో కేటీఆర్‌పై నమోదైన కేసుపై హైకోర్టు స్టే విధించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్‌తో చిత్రీకరించిన ఘటనలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌లపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యూరేజీపై డ్రోన్ ఎగురవేశారని మహదేవ్‌పూర్ పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు.
దీంతో కేసును కొట్టివేయాలని కోరుతూ.. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు హాజరుకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 5కు హైకోర్టు వాయిదా వేసింది.
Advertisement
Next Story