- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Car Accedent: కుత్బుల్లాపూర్ లో దారుణం.. కారు ఢీ కొట్టడంతో గాలిలో ఎగిరిపడి వ్యక్తి మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు వేగంగా ఢీ కొట్టిన దారుణ ఘటన కుత్బుల్లాపూర్ లో జరిగింది. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికి సంబందించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ప్రకారం గోపి అనే సెక్యూరిటీ గార్డు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో అతడు గాలిలో ఎగిరిపడి అక్కడే మృతి చెందాడు. దీనికి సంబందించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో కారు నడుపుతున్నది స్టూడెంట్ మనీష్ గా పోలీసులు గుర్తించారు. అతడికి స్పల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి మద్యం మత్తు, అతివేగమే కారణాలుగా అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని ఓ పోలీస్ అదికారి వెల్లడించారు.