- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోలీస్‌ని, కాంగ్రెస్ ఎమ్మెల్యే పాగల్ అనడం నేరమే.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: రౌడీల, రేవంతుల రాజ్యంలో పాపం పోలీసులకే రక్షణ కరువు అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS leader RS Praveen Kumar) ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు (Congress MLA), పోలీసు అధికారికి (Police Officer) జరిగిన ఘర్షణపై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ డీజీపీ (Telangana DGP), ఏసీపీ జానీ నర్సింహులు (ACP Jhony Narsimhulu) మామూలు పోలీస్ అధికారి కాదని, అత్యంత ధైర్య సాహసాలు చూపించి ఎన్నో సార్లు డిపార్ట్‌మెంట్ (Department) పరువు కాపాడిన వ్యక్తి అని, సహచరుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా వెరవని ఖాకీ బుల్లెట్ (Khaki Bullet) అని కొనియాడారు.
అలాగే పాపం నర్సింహులు ఒక ఎస్సీ (SC) కావడం వల్ల యాక్సిలరేటెడ్ ప్రమోషన్ (Accelerated Promotion) కూడా ఇవ్వలేదు ఈ డిపార్ట్మెంట్ అని, ఫారిన్ మందు సీసాలు మోసిన కొంత మందికి మాత్రం దొడ్డిదారిన ఆక్సిలరేటెడ్ ప్రమోషన్లు వచ్చాయని, ఆ చిట్టా మళ్లెప్పుడైనా బయట పెడతానని చెప్పారు. అంతేగాక అలాంటి నిజాయితీ కల నిప్పులాంటి ఆఫీసర్ ను రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ (Ramagundam Congress MLA Makkan Singh), పాగల్ గాడు అనడం ముమ్మాటికీ నేరమేనని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ రాజ్యం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేస్ పెట్టాలని కోరారు. లేక పోతే వాళ్లే హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏసీపీ మీదనే కేసు పెట్టమంటారు.. జాగ్రత్త! అని దుయ్యబట్టారు.
రౌడీల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించిన ఏసీపీ నర్సింహులుకు ప్రమోషన్ మరియు మంచి పోస్టింగ్ ఇవ్వాలని సూచించారు. నిక్కచ్చిగా డ్యూటీ చేసిన ఏసిపికే గొడవ వద్దంటూ సర్దిచెప్పిన తోటి పోలీసు అధికారులను అర్జంటుగా సస్పెండ్ చేయండి అని, అలాంటి బలహీనులకు డిపార్ట్మెంట్ లో స్థానం ఉండకూడదని అన్నారు. ఇక తెలంగాణ పోలీసులు కొంచెం ఆ జానీ నర్సింహులును చూసి ధైర్యం తెచ్చుకోండి అన్నలారా, చెల్లెలారా, అంటూ.. నిజాయితీగా చట్ట పరంగా డ్యూటీ చేస్తే ప్రజలు మిమ్ముల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారని చెప్పారు. రేవంత్- మక్కాన్ లాంటి వారు కేవలం కాగితపు పులులేనని, వాళ్లకు తెలంగాణ కోర్టు లో శిక్ష తప్పదని ఆర్ఎస్పీ (RSP) కామెంట్ చేశారు.