BSNL 5G : బీఎస్ఎన్ఎల్ నుంచి షాకింగ్ అప్‌డేట్.. 5జీ సేవలపై కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-09-05 05:30:54.0  )
BSNL 5G : బీఎస్ఎన్ఎల్ నుంచి షాకింగ్ అప్‌డేట్.. 5జీ సేవలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌‌డెస్క్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించిన 4జీ టెక్నాలజీ సపోర్ట్‌ను వాడుకుని బీఎస్ఎన్ఎల్ (BSNL) అద్భుతాలు చేస్తోంది.తాజాగా 4జీ సేవలను విస్తృతం చేసిన ఆ సంస్థ ఆకర్షణీయమైన టారీఫ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. అయితే, 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ అదిపోయే న్యూస్ చెప్పింది. 2025 సంక్రాంతి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5జీ (5G) సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్‌.శ్రీను పేర్కొన్నారు. అతి త్వరలో 5జీ సేవలకు గాను టవర్లు, హై టెక్నాలజీ పరికరాలను రీప్లేస్ చేసేందుకు ఫోకస్ పెట్టామని అన్నారు. అయితే, వినియోగదారుడు ఎలాంటి అదనపు పెట్టుబడి పెట్టకుండానే 4జీ నంచి 5జీకి అప్‌గ్రేడ్ చేసుకునేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

హాట్‌కేక్‌లా బీఎస్ఎన్‌ఎల్‌..

టెలికాం రంగాన్ని ఏలుతున్న కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వీ (Vodafone Idea) వంటి ప్రధాన టెలికం ఆపరేటర్లు ఈ మధ్య విపరీతంగా టారీఫ్‌లను పెంచేశారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ లాంఛ్ చేసిన రీచార్జ్ ప్లాన్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. దాదాపు 15 శాతం మేర కొత్త కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అవ్వడంతో తాజాగా అధికారులు 5జీ సేవలు అందించేందుకు ఫోకస్ పెట్టారు.

Advertisement

Next Story