BSF: నికరంలేని సేవ వారి నిబద్ధతకు నిదర్శనం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Ramesh Goud |
BSF: నికరంలేని సేవ వారి నిబద్ధతకు నిదర్శనం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: బీఎస్ఎఫ్ రైజింగ్ డే(BSF Raising Day) సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బంది త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆయన.. బీఎస్ఎఫ్ రైజింగ్ డే నాడు, మన దేశ సరిహద్దులను అచంచలమైన సంకల్పంతో కాపాడే వీరులకు సెల్యూట్(Salute) చేస్తున్నానని తెలిపారు. అలాగే సవాలుతో కూడిన భూభాగాల్లో వారి కనికరంలేని సేవ దేశం పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. అంతేగాక బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యానికి, త్యాగానికి వందనం అంటూ.. జై హింద్! అని బండి సంజయ్ ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story