TG News: నారాయణమూర్తికి కేటీఆర్ కీలక హామీ

by srinivas |   ( Updated:2024-07-20 15:13:34.0  )
TG News:  నారాయణమూర్తికి కేటీఆర్ కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నటుడు ఆర్ నారాయణ మూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నారాయణ మూర్తికి ఫోన్ చేసిన ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో కోలుకుంటారని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ తరపున తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆర్ నారాయణ మూర్తికి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆర్ నారాయణ మూర్తి సినిమాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని, ఆయన ముక్కు సూటి మనిషని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ఉత్సాహంగా తమనందరిని అలరించాలని కోరుకున్నారు. అలాగే నారాయణ మూర్తికి నిమ్స్ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.

కాగా ఆర్ నారాయణ మూర్తి ఈ నెల 17న అస్వస్థతకు గురయ్యారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా నీరసానికి గురయ్యారు. దీంతో తోటి నటులు వెంటనే ఆర్ నారాయణ మూర్తిని నిమ్స్‌కు తరలించారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందుతోంది. రెండు నెలల క్రితం ఆర్ నారాయణమూర్తికి బైపాస్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంచెం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణ మూర్తి కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆర్ నారాయణ మూర్తి ఆరోగ్యంపై సినీ నటులు కొందరు ఆందోళన చెందారు. దీంతో ఆర్ నారాయణ మూర్తి స్పందించి ఎవరూ ఆందోళన చెందొద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read More..

కాసేపట్లో ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

Advertisement

Next Story

Most Viewed