అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-05-01 11:46:31.0  )
అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు.. అని ట్వీట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సంచలన కౌంటర్ ఇచ్చింది. ‘అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! రేవంత్ రెడ్డి.. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలని విమర్శించింది.

విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మవి నువ్వు.. వెళ్ళి, నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు.. నిన్ను ఉరికిస్తరు.. అని పేర్కొంది. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్.. చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్.. అని ఆరోపించింది. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే.. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే.. ఎంత అభత్రభావంతో బ్రతుకుతున్నావో అర్థమవుతుందిని విమర్శించింది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దాం అనుకుంటే ప్రజలు నీ లాగుల తొండలు ఇడుస్తరు.. ఖబడ్దార్! అని తీవ్రస్థాయిలో విమర్శించింది.

Advertisement

Next Story