మేము ప్రజాప్రతినిధులుగా ఉండటంతోనే నష్టనివారణ.. ఎమ్మెల్సీ తాతా మధు

by Javid Pasha |
మేము ప్రజాప్రతినిధులుగా ఉండటంతోనే నష్టనివారణ.. ఎమ్మెల్సీ తాతా మధు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరదలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేము ప్రజాప్రతినిధులుగా పనిచేయడం వల్లనే గోదావరి వరదల కారణంగా నష్టం జరగలేదు’ అని వ్యాఖ్యానించారు. గురువారం మండలిలో అత్యధిక వర్షపాత పర్యవసానాలు-ప్రభుత్వ చర్యలపై లఘు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధు మాట్లాడుతూ.. గోదావరికి 50పైగా ఫీట్ల వరదలు వచ్చినా ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిపక్షాలు వరద సహాయచర్యల్లో పాల్గొనకుండా బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నాయని, హైదరాబాద్ ఔనత్యాన్ని దెబ్బతినేలా చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది ఫొటోలుకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బృందం వరదలు తగ్గాక పర్యటిస్తున్నారని, నష్టం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కేంద్రంపై తెలంగాణ వివక్ష మానుకొని అభివృద్ధి సహకరించాలని, నష్టపరిహారం అందజేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed