MLC Kavitha: పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత భరోసా.. కాంగ్రెస్‌కు కీలక డిమాండ్

by Ramesh N |
MLC Kavitha: పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత భరోసా.. కాంగ్రెస్‌కు కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఉద్యమకారుడు పోలీసు కిష్టయ్య (Police kistaiah) 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్సీ కవిత ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్‌ను కలిశారు. వారిని కలుసుకున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

గతంలో తమ కుమార్తె ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసిన పద్మావతి.. కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే తరహాలో భవిష్యత్తులోనూ పార్టీ పోలీసు కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఆమె చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed