- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళా కమిషన్ కార్యాలయానికి MLC కౌశిక్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు. మంగళవారం ఉదయం తన అడ్వకేట్‌తో కలిసి కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. గవర్నర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గవర్నర్‌పై అనుచిత పదాలు వాడిన నేపథ్యంలో స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందిగా మహిళా కమిషన్ ఆదేశించింది.
కాగా, నోటీసుల నేపథ్యంలో ఇదివరకే స్పందించిన కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ పంపించిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని తాను చేసిన ఆరోపణలను సమర్ధించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని తాను ఉపయోగించిన పదాలు తెలంగాణలో సాధారణంగా వాడే పదాలే అని చెప్పారు. ఒక్క పదాన్ని కాకుండా తాను మాట్లాడిన మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.