- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై BRS కీలక నేత ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి వచ్చిన నాటి నుంచి నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. GHMC కౌన్సిల్‌లో అధికార కాంగ్రెస్ కంటే.. తమ పార్టీ సభ్యులే ఎక్కువ ఉన్నారని అన్నారు.
బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కాగా, గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది. ఇది పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశమని తలసాని చెప్పారు. అయితే, తాము రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయ అంశాలపై కూడా చర్చించుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టడంపై చర్చించుకున్నామని తలసాని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని తెలిపారు.