మాపైన దాడులు జరుగుతున్నాయ్.. డీజీపీకి గులాబీ నేతల ఫిర్యాదు

by GSrikanth |   ( Updated:2024-01-30 14:36:16.0  )
మాపైన దాడులు జరుగుతున్నాయ్.. డీజీపీకి గులాబీ నేతల ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తమపైన దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం డీజీపీ రవిగుప్తాను బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దాడులపై ఫిర్యాదు చేశామన్నారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో కార్యకర్తలను హత్యలు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో ఆయన ప్రోద్భలంతో భువనగిరి జెడ్పీచైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడి అన్యాయమన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వనియోగంతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ చైర్పర్సన్ దీపిక, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ పాల్గొన్నారు.


Also Read: కేసీఆర్, కేటీఆర్‌, హరీష్ రావుకు కూడా అపాయింట్మెంట్ ఇస్తా: సీఎం రేవంత్

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed