- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్.. ధర్నా డ్రామా మానుకో: దాసోజ్ శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో : విపత్కర పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు చేయడం రేవంత్ మానుకోవాలని, జీహెచ్ఎంసీ ధర్నా డ్రామా మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత దాసోజు శ్రవణ్ హితవు పలికారు. ప్రభుత్వ సహాయక చర్యలు అడ్డుకునేందుకు రేవంత్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ముట్టడి పిలుపు సామాజిక నేరం అన్నారు. జీహెచ్ఎంసీ ముట్టడి పిలుపు ప్రజల కోసమా లేక చిల్లర పబ్లిసిటీ రాజకీయాల కోసమా? ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటావా లేక ధర్నాల పేరుమీద అడ్డుకుంటావా? మీ ధర్నా డ్రామాలను పర్యవేక్షించాల్నా లేక ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు ప్రజలకు అండగా ఉండాల్నా ? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ముట్టడికి పిలుపు నిచ్చిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. వర్షానికి సెల్లార్లలోకి, కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి జనం పడ్డ అవస్థలు పడుతుండటంతో రేవంత్ రెడ్డికి ఎందుకు అక్కసు అని ప్రశ్నించారు.
రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బదీస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు పాలకుల తప్పిదమా? మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి లో ఒక్క ముంపు ప్రాంతాన్ని అయిన వెళ్లి చూసాడా అన్నారు. ఢిల్లీ లో చిల్లర రాజకీయాలతో పూట గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి విషయంపై మాట్లాడే నైతికత లేదన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ గ్యాంగుల భూకబ్జాలు, సాక్షాత్తు రేవంత్ ద్వారా ప్రస్తుతం ఇబ్బందులకు గురౌతున్న సామాన్య భూబాధితులపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు. వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు చేతనైతే సహాయ చేయాలని సూచించారు.