కడియం శ్రీహరి విషయంలో BRS కీలక నిర్ణయం

by GSrikanth |   ( Updated:2024-03-30 08:27:43.0  )
కడియం శ్రీహరి విషయంలో BRS కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కడియం శ్రీహరి వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కడియంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం గులాబీ ఎమ్మెల్యే బృందం స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి బయలుదేరారు. మరోవైపు కడియం శ్రీహరి, కడియం కావ్య తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని మీడియా వర్గాల్లో వార్త చక్కెర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌లోని ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోవడం పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed