కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, అయితే ఇది వంశీ చందర్ రెడ్డి, మల్లు రవినో దెబ్బ తీసే కుట్ర కాదని నేరుగా రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని బీజేపీ, బీఆర్ఎస్ లు ఏకమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ను ఓడిస్తే రాష్ట్రమంతటా నన్ను తిట్టవచ్చనే ఆలోచనతో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాని ఈ విషయం వారి పార్టీలోని మన అభిమానులే చెప్పారన్నారు. కాంగ్రెస్ ను కాదని మరో పార్టీకి ఓటు వేస్తే ఏదైనా లాభం ఉందా? పదేళ్లుగా కేంద్రంలో మోడీనే ప్రధానిగా ఉన్నారు కదా అని ప్రశ్నించారు. డీకే అరుణ బీజేపీలో చేరి జాతీయ పదవి తెచ్చుకున్నారు తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం సాధించారని ప్రశ్నించారు. ఉపాధ్యక్ష ఉపాధ్యాక్షరాలి హోదాలో పాలమూరు ప్రాజెక్టుకు డీకే అరుణ జాతీయ హోదా సాధించవచ్చు కదా అని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతుందని మోడీ, బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే వాళ్లు కాదని వారంతా సంక్రాత్రి నాడు గంగిరెద్దోలలా ఓట్ల కోసం వచ్చి పోయేటోలేనని విమర్శించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీని 200 ఓట్లతో గెలవబోతున్నామని రేవంత్ రెడ్డి ధీమ వ్యక్తం చేశారు.

సంపత్ కు కీలక పదవి:

ఎంపీ ఎన్నికలు ముగియగానే అధిష్టానంతో మాట్లాడి సంపత్ కు మంచి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. అంతా సార్ చూసుకుంటారనే భరోసాతో పండగలు, పబ్బాల పేరుతో జిల్లాలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. వాల్మీకి బోయలను ఆదుకునే బాధ్యత మాది అని చెప్పారు. ఎన్నికలు అయ్యాక నేను సీఎం కార్యాలయాలనికి పిలిపించి మీ సమస్యలపై చర్చించి అక్కడే ఆదేశాలిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed