- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిన నాడే.. వారికి తెలంగాణతో పేగుబంధం తెగింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చిన నాడే తెలంగాణతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన కృష్ణా జలాల పంపకాలపై ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఎక్కువ దోపిడి జరిగిందని ధ్వజమెత్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించారని తెలిపారు. అధికార దాహంతో, అవినీతికి పాల్పడి పక్క రాష్ట్రంలోని సీఎం జగన్‌తో కుమ్మక్కై.. బీఆర్ఎస్ పేరు పెట్టి ప్రధాని పీఠానికే టెండర్ పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇక కాంగ్రెస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు.
ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన నాడే తెలంగాణతో వారి పేగు బంధం తెగిపోయిందంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నోటికొచ్చినట్లుగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా.. ఇంకా మీకు బుద్ధి రాలేదా అంటూ తీవ్ర స్వరంతో మందలించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ జన సమీకరణ చేసేందుకు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఊరూరు తిరుగుతున్నారని.. అందుకే ఇవాళ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదని ఆరోపించారు. హరీశ్‌రావుకు మేనమాన సాలొచ్చిందని, అబద్ధాలు ఆడటంలో ఆయన మించిపోయాడని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.