- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే సమయం సీఎంకు లేదా: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం సీఎం రేవంత్‌రెడ్డికి లేదా అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం, మంత్రులు పాలన మరిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందని అన్నారు. నిరుద్యోగులు తమ సమస్యలను తీర్చాలని నిరసన చేపడితే సెక్రటేరియట్, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బకాగాలను మోహరించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల దగ్గరకు వెళ్లారని.. ఇప్పుడు వాళ్లను ఉగ్రవాదులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు
సీఎం రేవంత్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరించడం మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాని హితువు పలికారు. నిరుద్యోగులు కేవలం డీఎస్సీ వాయిదా వేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీలో భట్టి డిమాండ్ చేయలేదా అని గుర్తు చేశారు. నిరుద్యోగుల వద్దకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చిలక పలుకులు పలికించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం అణచివేస్తుంటే మేధావులైన ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రస్తుతం నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తురని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని సమస్యలపై బీఆర్ఎస్ తప్పక పోరాటం చేస్తుందని బాల్క సుమన్ అన్నారు.