- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్ హోదా
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతకు ముందు చెప్పినట్లుగానే ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి, కేబినెట్ హోదాను కల్పించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ కో-ఆపరేటివ్ ఫెడరేషన్‌కు చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం కాసేపటి క్రితం జీవో జారీ చేసింది.
కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్‌లో ఉంటే తనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో పోచారం సొంతగూటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన జూన్ 21న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిక సమయంలో పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని, కేబినెట్ హోదా పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌కు కేసీఆర్ మొండిచేయి చూపించారు. దీంతో తీవ్ర ఆసంతృప్తితో కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న అమిత్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం సమర్ధించారు. అయితే, ఇచ్చిన మాట మేరకు పోచారంకు కేబినెట్ హోదా.. గుత్తా అమిత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టకుని కొర్పొరేషన్ పదవి ఇవ్వడం పట్ల రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో మారుమోగుతోంది.