- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: విపక్షాల విమర్శలకు భయపడితే సమస్యలు పరిష్కారం కావు: మండలి చైర్మన్ గుత్తా హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్/నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో శాసనమండలి రద్దు చేస్తారనే ప్రచారంపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మండలి రద్దు అనే విషయం పూర్తిగా అసంబద్ధమైన ప్రచారమని కొట్టిపడేశారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం శుభ పరిణామమేనని అన్నారు. విపక్షాల విమర్శలకు భయపడితే సమస్యలు కావంటూ ఆయన చేసి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఉండి గుత్తా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. అదేవిధంగా కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలు శాంతియుతంగా కూర్చొని మాట్లుడుకుంటే సరిపోతుందని గుత్తా అన్నారు. కృష్ణ జలాలలో మన వాటా మనకు దక్కాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఎంత మేరకు కృష్ణా జలాలు పారుతున్నాయో ఆ నిష్పత్తిలోనే సాగుకు వినియోగించుకోవాలని అన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన ఏడు మండలాలు తిరిగి రావడం కష్టమేనని, భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామాలు మాత్రం తెలంగాణలో కలిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాని సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, అందులో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూడా ఒకటని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజవర్గాలను పెంచితే తెలంగాణకు సుమారుగా 34 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రకు 50 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటివి భూమి సాగు చేస్తున్న అర్హులకు మాత్రమే ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంపన్నులు, ట్యాక్స్ చెల్లింపుదాలను రైతు భరోసా పథకం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించాలని ప్రభుత్వానికి చూచించారు. రైతు భరోసా అమలుపై ప్రతి నియజవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం శుభపరిణామం అని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ప్రస్తుతం రాజకీయ విమర్శలపై మండలి చైర్మన్‌గా తాను స్పందిచలేనని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.