- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING:అధికార బలంతో మా గొంతు నొక్కారు: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: శాసనసభలో అధికార బలంతో ప్రభుత్వం తమ గొంతు నొక్కేసిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు రాగనే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం విషయంలో ఎన్నో హామీలను గుప్పించిందని గుర్తు చేశారు. ఉద్యోగులను పీఆర్సీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయంపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటిస్తారని ప్రశ్నించగా.. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నేడు సభలో అధికార బలాన్ని చూపించి మా గొంతు నొక్కుతుండొచ్చని.. రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోలేదని అన్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధంచి ఏప్రిల్, మే నెలలో డబ్బులు ఇంకా వేయలేదని అన్నారు. ఆ అంశంపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.