BIG BREAKING: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమెర్ అలీఖాన్

by Shiva |
BIG BREAKING: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమెర్ అలీఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ఎమ్మెల్సీల నియామకంపై ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. ఈ మేరకు ఇవాళ టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమెర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్ చాంబర్‌లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం వెల్లడించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా అడ్డుకునేలా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు భంగం కలిగించనట్లే అవుతోందని, ఖాళీలను భర్తీ చేయడం ప్రభుత్వం కర్తవ్యం అని ధర్మాసనం వెల్లడించడంతో కొదండరాం, అలీఖాన్ లైన్ క్లియర్ అయింది.

Advertisement

Next Story

Most Viewed