BREAKING: కర్ణాటకలో హవాలా డబ్బు రూ.5.5 కోట్లు పట్టివేత.. పోలీసుల అదుపులో ముగ్గురు

by Shiva |
BREAKING: కర్ణాటకలో హవాలా డబ్బు రూ.5.5 కోట్లు పట్టివేత.. పోలీసుల అదుపులో ముగ్గురు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ సందర్భంగా ఓటర్లను వివిధ రూపాల్లో ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీల నాయకులు తయిలాలను పంచి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే, వాటన్నింటకీ అడ్డుకట్ట వేసేందుకు ప్రధాన చెక్‌పోస్టులు, కూడళ్లు, టోల్‌గేట్ల వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ మేరకు అనుమానాస్పదంగా డబ్బును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగదును సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కర్ణాటకలోని బళ్లారిలో పోలీసులు తనఖీలు చేపడుతుండగా ఓ కారులో రూ.5.5 కోట్ల నగదు, 3 కిలోల బంగారం లభ్యమైంది. అయితే నగదు, బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో ముగ్గురిని పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story