- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: తెలంగాణ సీఎస్ పేరిట ఫేక్ ఫోన్ కాల్స్.. ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు తమ పంజాను విసురుతున్నారు. కొందరికి స్టాక్ మార్కెట్ పేరిట పెట్టుబడులు పెట్టాలంటూ టోకరా వేస్తే.. మరొకరికి ప్రైజ్ మనీ పేరిట నిలువు నామం పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. క్యాష్ పేమెంట్స్ నిలిచిపోవడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ జోరు పెరిగింది. దీంతో కొందరు ఘరానా మోసగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా తన పేరు, ఫొటోను ఉపయోగించి కొందరు మోసగాళ్లు పలువురికి ఫేక్ కాల్స్ చేస్తున్నారంటూ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. +977-984-4013103 ఫోన్ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కొందరికి కాల్స్ చేశారని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TSCSB)కి ఫిర్యాదు చేశారు. కాల్ చేసిన వాళ్లను వెంటనే గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎస్ శాంతికుమారి కోరారు.