- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి స్పందించిన సీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్వేస్టిగేషన్‌పై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డితో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ పోలీసు ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించింది.
అదేవిధంగా కేసు విచారణకు స్పెషల్ పీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఇందుకు గాను ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. హై ప్రోఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారిగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి.