కుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందించిన KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-21 07:53:25.0  )
కుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందించిన KTR
X

దిశ, వెబ్‌డెస్క్: కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలుడి మృతి ఎంతగానో కలిచివేసిందన్నారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా హైదరాబాద్ అంబర్ పేట పరిధిలో వీధి కుక్కలు నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ను జంతువులను వేటాడినట్లు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయికి చెందిన గంగాధర్ కుమారుడు ప్రదీప్ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోవడం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. సీసీ కెమెరాల్లో బాలుడిపై కుక్కల దాడి వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తోంది.

Next Story

Most Viewed