- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్: ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 మందితో టీ-బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుందని స్పష్టం చేశారు. 50 మందిలో 10 మంది మహిళలు, 20 మంది బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇవాళ లేదా రేపు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని ఫైర్ అయ్యారు. బీసీలు, మహిళలకు బీజేపీ మాత్రమే పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
Next Story