- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం
by Sathputhe Rajesh |

X
దిశ, లోకేశ్వరం: ప్రజల సమస్యలు తీర్చడంలో బిఅర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని నిరసిస్తూ బిజేపి నాయకులు శుక్రవారం లోకేశ్వరంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోకేశ్వరంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరయ్యేందుకు వస్తుండగా అడ్డుకునే యత్నం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, చేపట్టలేదని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ డౌన్ డౌన్, అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకున్న వారిలో సాయినాథ్ , సంజీవ్ సందీప్ తదితరులు ఉన్నారు.
Next Story