- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CS మేడమ్ మీకు కవల సోదరి ఉందా.. BJP మద్దతుదారుల ఘాటు రియాక్షన్!
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా గడువు ఉండగానే తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాజ్ భవన్ సెంట్రిక్‌గా బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా పెండింగ్ బిల్లుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై గవర్నర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర ఉందని, సీఎస్ శాంతి కుమారి బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస మర్యాదగా వచ్చి తనను కలవలేదని, కర్టసీగా ఫోన్ కూడా చేయలేదంటూ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వచ్చేందుకు టైమ్ లేదా అని ట్విట్ చేసింది.
గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందిస్తూ రాజ్ భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ 'సీఎస్ మేడమ్ మీకు కవల సోదరి ఉందా ఈ ఫోటోలో అలా కనిపిస్తోందా? గౌరవనీయులైన గవర్నర్ మీరు అధికారికంగా ఎప్పుడు రాజ్ భవన్‌కు రాలేదని ఆరోపిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. మరికొందరేమో గవర్నర్ ఈ ట్వీట్ చేసినంత టైమ్‌లో పెండింగ్ బిల్లులపై సంతకాలు పూర్తయ్యేవని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు గవర్నర్ ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్‌పై బీజేపీ మద్దతు దారులు సైతం కౌంటర్ చేస్తున్నారు.
గవర్నర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని అంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎస్ రాజ్ భవన్‌కు వెళ్లిన తను స్వయంగా వెళ్లలేదని హైకోర్టు ఆదేశాలతోనే అక్కడికి వెళ్లిందని మీ లాంటి మందబుద్ధులకు ఆ విషయం ఎట్లా తెలుస్తుందంటూ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. రిపబ్లిక్ డే ఈవెంట్ అనంతరం లేదా అంతకు ముందు అసలు సీఎస్ ఎన్ని సార్లు రాజ్ భవన్‌కు వచ్చారని నిలదీస్తున్నారు. తెలంగాణ ఫస్ట్ సిటిజన్‌పై ఈ తరహా ఎటాక్ ఆపాలని కోరుతున్నారు. మొత్తంగా ఇరు వైపుల నుంచి ఎటాక్ కౌంటర్ ఎటాక్ లతో గవర్నర్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.