- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మరో నాలుగు రోజుల్లో కవితకు నోటీసులు.. కేటీఆర్ కూడా జైలుకే'
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో పాటు ఫీనిక్స్, బిల్డర్స్ స్కామ్‌లో కేటీఆర్‌కు సైతం అరెస్ట్ తప్పదని అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను జోకర్‌గా పేర్కొనడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు సీఎం కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అనే విషయాన్ని తెలుసుకోవాలని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని మాట్లాడే మాటలను తామూ సీరియస్‌గా తీసుకోవడం లేదని అయితే కేటీఆర్‌పై నార్కొటిక్స్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఇరుక్కుంటారని ఆయనకు నార్కొటిక్స్ పరీక్షలు చేస్తే నూటికి నూరు శాతం పాజిటివ్ వస్తుందని భావిస్తున్నాన్నారు. మరో నాలుగు రోజుల్లో కవితను దర్యాప్తు సంస్థ అధికారులు విచారణకు పిలుస్తారని అదే సమయంలో ఆమె చేతికి బేడీలు వేసి తీసుకువెళ్లడం ఖాయమన్నారు. దేశంలో హిందువులను చంపేందుకు ఉన్న పీఎఫ్ఐ సంస్థను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్టు పార్టీ ఎంఐఎం అని అన్నారు. ఎంఐఎం పార్టీ పైకి ఒక రకంగా లోపల మరో రకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి, కవిత, కేటీఆర్ వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తనకు సమాచారం ఉందన్నారు.
ఈడీ, సీబీఐలు ఎవరి ప్రోద్బలంతో పని చేస్తాయని తాను అనుకోవడం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంటే కవితను జైలుకు పంపించేందుకు కేటీఆరే ఇన్ఫ్లూయెన్స్ చేసి ఉంటారని అన్నారు. కవితను ఓడించేందుకు టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా తనకు మద్దతిచ్చేలా కేటీఆరే ప్రోత్సహించారని అన్నారు. కవితను ఓడించడంతో పాటు ఆమెను జైలుకు పంపడంలో కూడా కేటీఆర్ పాత్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, పసుపు రైతుల విషయంలో ఇదే జరుగుతోందన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదన్నారు. రైతు ఐక్య వేదిక సభ్యులతో కలిసి కేంద్ర మంత్రులు కైలాశ్ చౌదరి, నరేంద్ర సింగ్ తోమర్ తో భేటీ అయి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
Crime News : నగ్నంగా బాలికను 2 కి.మీ. నడిపించిన కామాంధులు.. ఆపై నలుగురు కలిసి అత్యాచారం