- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్‌కు బీజేపీ ఎమ్మెల్యే డెడ్ లైన్.. వారం రోజుల్లో క్లారిటీ ఇవ్వకపోతే దీక్షకు దిగుతానని వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూ్ర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బహిరంగ లేఖ లేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సొంత సెగ్మెంట్ కొడంగల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత ఇలాకా మధిరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం నిర్మించనున్న రెండు ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూళ్లు సౌత్ తెలంగాణకే (ఖమ్మం, మహబూబ్ నగర్) కేటాయించి నార్త్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సీఎం, డిప్యూటీ సీఎంలకు బుధవారం ఆయన బహిరంగా లేఖ రాశారు. ఆర్మూర్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నార్త్, సౌత్ తెలంగాణ సెంటిమెంట్ రెయిజ్ చేయడంతో ఈ ఇష్యూలో రేవంత్ సర్కార్ ఇరుకున పడే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. మరీ రాకేష్ రెడ్డి లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.