గూండాయిజం చేసినట్లు ప్రూవ్ చేస్తావా.. ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్ (వీడియో)

by GSrikanth |
గూండాయిజం చేసినట్లు ప్రూవ్ చేస్తావా.. ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాను గుండాయిజం చేసినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ప్రూవ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. ఈ మేరకు పాడి కౌషిక్ రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసురుతున్నా.. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?’ చెప్పాలని సవాల్ చేశారు. ఆరోపణలు చేయడం తగదని, తాను ఏం గూండాయిజం చేశానో చెప్పాలన్నారు. ‘‘నేను ఎవరినైనా కొట్టిన్నా? ఎవరినైనా తిట్టిన్నా? ఎవరి ల్యాండ్ అయిన కబ్జా చేసిన్నా? ఏం చేసినా? అని మండిపడ్డారు. తాను అక్కడ సెక్రటరీని తిట్టినట్లు ఒప్పుకున్నాడు.

ఎందకు తిట్టారంటే జూపాక విలేజ్‌లో మోరీ ప్రాబ్లం ఉందని ఒక ఐదారు సార్లు చెప్పిన.. పని చేయకపోతే ఏమంటారు? అని అన్నారు. పేద ప్రజలు, పేద మహిళలు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పని చేయండని మంచిగా చెప్పాను అతను వినలేదన్నారు. వినకపోతే గట్టిగా చెప్పాలా వద్ద.. గట్టిగా చెప్పిన తర్వాతనే పరిష్కారం అయ్యిందన్నారు. సమస్య పరిష్కారం అవ్వడంతో నేడు జూపాక ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story