- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ వీడియో అప్లోడ్ చేసి తీరుతా.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన Raja Singh
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అవుతున్నాయి. మహ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుతూ.. రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోపై ఎంఐఎం కార్యకర్తలు మండిపడుతున్నారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం కార్యకర్తలు పలు పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దీంతో అర్థరాత్రి నుండి ఓల్డ్ సిటీలో హైడ్రామా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తాను షేర్ చేసిన వీడియోపై క్లారిటీ ఇచ్చారు.
''రాముడిని కించపరిచిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ వస్తే.. తీవ్ర పరిణామాలుంటాయని ముందే హెచ్చరించా. అయినా మునావర్‌తో షో నిర్వహించారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి ఎలా భద్రత కల్పించారు. మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పా.. చెప్పిన విధంగానే వీడియోను షేర్ చేశా.. కానీ, యూట్యూబ్‌లో తొలగించారు. ఆ వీడియో పార్ట్-2ను త్వరలోనే అప్‌లోడ్ చేస్తా.. యాక్షన్‌కు కచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం చావడానికైనా సిద్ధం'' అని రాజాసింగ్ తెలిపారు.
రాష్ట్రంలో వేడెక్కిన వాతావరణం.. బండి సంజయ్, రాజాసింగ్ అరెస్ట్