- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి: ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో రోజుకో విషయం బయటకు వస్తోందని, తవ్వుతున్న కొద్ది పేర్లు బయటికి వస్తున్నాయని అన్నారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీలో ఇంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలు ఎవరివి? అని నిలదీశారు. ఈ ఉద్యోగులకు సీఎంఓకు ఉన్న సంబంధం ఎంటీ? సిట్ విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. కూతురు, కొడుకు కోసం 4కోట్ల రాష్ట్ర ప్రజల క్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసుల నుంచి రెండు నెలలుగా అసలు రాష్ట్రంలో పాలన సాగడం లేదన్నారు. కవిత వెనకాలే ఢిల్లీకి మంత్రులు వెలుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి, పంట నష్టం, నగరంలో భవనాలు కూలుతున్నా.. కాలుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన కంటి తుడుపు చర్య అని, ప్రకటించిన నష్టపరిహారం కూడా ఇదే విధంగా ఉందన్నారు. తొమ్మిది ఏళ్లలో అనేక సార్లు పంట నష్టం జరిగిన సీఎం ఏనాడైనా పట్టించుకోలేదన్నారు. గతంలో ప్రకటించిన నష్టపరిహారం ఏమైంది? అని నిలదీశారు.