- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 మందితో BJP తొలి జాబితా.. విడుదలకు ముహూర్తం ఖరారు!
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల గెలుపే లక్ష్యంగా బీజేపీ సిద్ధమవుతోంది. అందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయాల్లో కసరత్తు చేస్తుండగా.. బీజేపీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. త్వరలోనే 100 మంది పేర్లతో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఈ లిస్టులో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 29న భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మెజార్టీ సాధించే దిశగా తొలి జాబితా కీలకం కానుంది.
వారణాసి నుంచి 2014లో 3.37లక్షలు, 2019లో 4.8 లక్షల భారీ మెజార్టీతో మోడీ విజయం సాధించారు. ఎల్కే అడ్వాణీ పూర్వ స్థానమైన గాంధీనగర్ నుంచి 2019 ఎన్నికల్లో అమిత్ షా గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో 370కిపైగా సీట్లు గెలుచుకోవాలనే పార్టీ లక్ష్యాల మేరకు శ్రద్ధగా పని చేయాలని నాయకులను కోరారు ప్రధాని మోడీ. రాబోయే వంద రోజుల్లో ప్రతి కొత్త ఓటరు, లబ్ధిదారుడు, వర్గానికి చేరువ కావాలని తెలిపారు. ఎన్డీఎ కూటమి 400 సీట్లు గెలవాలంటే.. బీజేపీ 370 సీట్ల మార్కు దాటాలని సూచించారు.