ప్రతి నిమిషం పరవశమే అంటూ నటితో చిందులేసిన నరేష్.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)

by Hamsa |
ప్రతి నిమిషం పరవశమే అంటూ నటితో చిందులేసిన నరేష్.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) నటిస్తున్న తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) . నందుమూరి బాలకృష్ణ(Balakrishna) హిట్ మూవీ టైటిల్‌తో రాబోతుండగా.. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన దర్శనమే మెలోడీ సినీ ప్రియులను మంత్ర ముగ్దులను చేస్తుంది. తాజాగా, ఈ సాంగ్‌కు టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, బుల్లితెర నటి సిరిహనుమంతుతో కలిసి డ్యాన్స్ చేశారు. దర్శనమే మధుర క్షణమే..ప్రతినిమిషం పరవశమే అనే లిరిక్స్‌కు వీరిద్దరు రొమాంటిక్ స్టెప్స్ వేశారు. పట్టు పంచెలో నరేష్ ఉండగా.. సిరి పట్టు చీర కట్టుకుని కనిపించింది. అయితే చివరలో వీరిద్దరు గట్టిగా కౌగిలించుకుని మరీ డ్యాన్స్ చేశారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా అలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు మీకేం పోయేకాలం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed