ఎమ్మెల్యే పల్లాకు బిగుస్తోన్న ఉచ్చు.. ‘హైడ్రా’ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ!

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-26 11:15:45.0  )
ఎమ్మెల్యే పల్లాకు బిగుస్తోన్న ఉచ్చు.. ‘హైడ్రా’ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనూహ్య షాక్ తగిలింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన మేడ్చల్‌ జిల్లా వెంకటాపూర్‌లోని నీలిమ మెడికల్ కాలేజీ ఎదుట పలువురు స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. తమ భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని హైడ్రా అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, వెంకటాపూర్ గ్రామం పరిధిలోని సర్వేనెంబర్ 796లోని నీలిమ ఆసుపత్రి సమీపంలో నాలుగు ఎకరాల తమ పట్టా భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడని స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను శాంతింపజేశారు. మా పట్టా భూమి మాకు చెందే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కాగా, ఇప్పటికే అనురాగ్, నీలిమ ఇన్స్టిట్యూట్‌లు FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలుగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. దీంతో ఏ సమయంలో హైడ్రా అధికారులు అటాక్ చేస్తారో తెలియక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed