TG News: తెలంగాణకు బిగ్ అలర్ట్... ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!

by srinivas |   ( Updated:2024-09-07 11:22:30.0  )
TG News: తెలంగాణకు బిగ్ అలర్ట్... ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాలు (Rains), వరదలు (Floods) పోయినవి అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ (Meteorology Department) ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో బాంబు పేల్చినట్టైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా పడి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఇళ్లు, రోడ్లు జలమయం అయ్యాయి. వరద నీళ్లు ఇళ్లలోకి చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు విలయతాండవం చేసింది. పరివాహక ప్రాంతాలను ముంచేసింది. భారీ వరదలతో మహబూబాబాద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగమంతా వరద ప్రాంతాల్లో పర్యటించింది. సహాయ చర్యలు అందించింది. అయినా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో ఈ మూడు ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ బాంబు పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed