- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Telangana Budget : రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) తెలంగాణ బడ్జెట్(Telangana Budget) ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ప్రవేశ పెట్టనున్నారు. అయితే అంతకముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ సమావేశం(Cabinet Meeting) కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. అనంతరం ఉదయం 11.14 గంటలకు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. మరోవైపు శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు(SridharBabu) బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రంలో కీలక పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది. కాగా ఈసారి తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండబోతుందని సమాచారం. ఇక మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుతోపాటు మరో ఐదు బిల్లులకు సభ ఆమోద ముద్ర వేసింది. అయితే నేడు జరగాల్సిన ప్రశ్నోత్తరాలు ఇరు సభల్లోనూ రద్దయ్యాయి.