స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్.. ఈ సారి పోటీ ఎక్కడో తెలుసా?

by Ramesh N |
స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్.. ఈ సారి  పోటీ ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియస్ బర్రెలక్క.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. 5754 ఓట్లు సాధించి ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయనున్నారు. మరోవైపు తన సమీప బంధువు వెంకటేశ్‌తో బర్రెలక్క పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story