వైరల్ అవుతున్న బర్రెలక్క ఎంగేజ్మెంట్ ఫోటోస్.. అబ్బాయి ఎవరంటే?

by Prasanna |   ( Updated:2024-04-05 09:52:49.0  )
వైరల్ అవుతున్న బర్రెలక్క ఎంగేజ్మెంట్ ఫోటోస్.. అబ్బాయి ఎవరంటే?
X

దిశ, ఫీచర్స్: బర్రెలక్క అన్న పేరు తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో దేశమంతట మారుమ్రోగింది. సోషల్ మీడియాలో ఒకే ఒక్క వీడియో పోస్ట్ చేసి లక్షలాది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. డిగ్రీ చదువుకున్నా కూడా ఉద్యోగం రాలేదు, దాంతో ఇక అప్పటి నుంచి బర్రెలు కాస్తున్నా అని చెప్పి వైరల్ అయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియానే షేక్ చేసింది. అలా వచ్చిన క్రేజ్, పాపులారిటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.. గెలవడం పక్కన పెడితే ఈమె కోసం పెద్ద పెద్ద స్టార్లు దిగి వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది బర్రెలక్క. బర్రెలక్క అలియాస్ శిరీష.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. పెళ్లి కార్డు కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా బర్రెలక్క ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.మొన్నటి వరకు బర్రెలక్కను చేసుకునే అబ్బాయి ఎవరో ? ఏంటో కొంచం కూడా తెలియలేదు.. నెటిజెన్స్ ఎంత ప్రయత్నించినా దొరకలేదు.. సోషల్ మీడియా దెబ్బకి ఈ సారి చాలా జాగ్రత్తపడుతున్నట్టు ఉంది. వరుడు ఫోటో ముందే బయటకు రాకుండా బర్రెలక్క బాగా మేనేజ్ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు రాజకీయాలు పక్కన పెట్టి, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని దీవిస్తున్నారు. కానీ బర్రెలక్క మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.. ఎం.పీ గా పోటీ చెయ్యడానికి సిద్దమే అంటుంది.

Read More: వాళ్లపై యాక్షన్ తీసుకుంటా.. వైరల్‌గా బర్రెలక్క వీడియో

Advertisement

Next Story