దమ్ముంటే ఆ పనిచేయండి.. మేమేంటో చూపిస్తాం: CM రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్

by Gantepaka Srikanth |
దమ్ముంటే ఆ పనిచేయండి.. మేమేంటో చూపిస్తాం: CM రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Election)ల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌తో మీరు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మాపై బురద జల్లుతారా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్‌ల విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని సవాల్ చేశారు.

సీబీఐ(CBI)కి అప్పగిస్తే మీలాగా కాలయాపన చేయకుండా.. దోషులందరినీ లోపల వేస్తామని కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డిలో ఓటమి భయం కనిపిస్తోందని విమర్శించారు. సర్వేలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని చెప్పడంతో ఏం చేయాలో అర్థంకాక కన్‌ఫ్యూజన్‌లో ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గెలుస్తామని ధీమా ఉంటే.. కాంగ్రెస్‌కు ఢోకా లేకుంటే ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారు.. బీజేపీపై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఒక్కటే అని, రెండు పార్టీల నాయకులు కలిసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని నిజామాబాద్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E Race Case)లో కేటీఆర్‌(KTR)ను ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం ప్రశ్నించారు. కేసు నమోదు చేయగానే ఈడీని పంపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు కాదా బండి సంజయ్ అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన ఫైళ్లు ఈడీ(Enforcement Directorate) తీసుకెళ్లడంతోనే విచారణ ముందుకు సాగడం లేదన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించి కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed