- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేషన్ కార్డులపై ఆయన ఫొటో పెట్టి తీరాలి.. బండి సంజయ్ సంచలన డిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) ఎదుట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక డిమాండ్ పెట్టారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జారీ చేయబోతున్న రేషన్ కార్డుల(New Ration Cards)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని విమర్శించారు. అవసరమైతే తామే రేషన్ కార్డులు ముద్రించి ఇస్తామని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తోన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు(indiramma illu) అని పెడితే కేంద్రం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వబోదు అని హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్న విషయం తెలిసిందే.