- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balmuri Venkat: కౌశిక్ రెడ్డి..ఇదే నీకు లాస్ట్ చాన్స్: బల్మూరి వెంకట్
దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్ల బీఆర్ఎస్ (Brs) పాలన, గత పది నెలల కాంగ్రెస్ (Congress) పాలనపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఈ చర్చకు పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఫామ్ హౌస్ కు వెళ్లి దొరనే కలుస్తారో లేక ఆ పార్టీలో మరెవరివద్దకైనా వెళ్తారో ఆయన ఇష్టం. ఏ డిపార్ట్మెంట్ అంటే దానిపై చర్చిద్దామని అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు నీ చరిత్ర, నీ బండారం ఏంటో బయటపెడతానన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారం కౌశిక్ రెడ్డికి సంబంధించినది కాదని, ఇది కేటీఆర్ కు సంబంధించిందన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ సన్నిహితులు ఉన్నారని అందువల్ల కేటీఆర్ (Ktr), రాజ్ పాకాల డ్రగ్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పుపొందేందుకు మాట్లాడితే సొంత పార్టీ నేతలే నిన్ను తిట్టే పరిస్థితి వస్తుందన్నారు.
రాజకీయం కోసం కౌశిక్ రెడ్డి ఎంతటి నీచానికైనా దిగజారే వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం భార్యను బిడ్డను బయటకు తీసుకొచ్చిన చరిత్ర నీదన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు, వారి దగ్గరి మిత్రులు డ్రగ్స్ తీసుకుంటారనే అనుమానాలు ఉన్నాయని అందువల్ల కేటీఆర్ కు ఆ అలవాటు ఉందని అనేక మంది అనేక సందర్భాల్లో ప్రస్తావించారని అన్నారు. కానీ ప్రతిసారీ కేటీఆర్ మాత్రం బుకాయిస్తూ దాటవేసే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు. మరోక్కసారి ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తే పరిస్థితులు బాగుండవని కౌశిక్ రెడ్డికి ఇది లాస్ట్ చాన్స్ అని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ సీపీలో మొదలైందని, రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ లో వచ్చి చేరాడు. రేపు ఎక్కడ ఉంటాడో తెలియదన్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి మంచిది కాదన్నారు.