తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు.. వాళ్ల ఇళ్లే టార్గెట్‌ పొద్దు పొద్దున్నే అటాక్!

by GSrikanth |
తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు.. వాళ్ల ఇళ్లే టార్గెట్‌ పొద్దు పొద్దున్నే అటాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం ఉదయాన్నే సోదాలు ప్రారంభించారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన పౌరహక్కుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూశ నివాసాల్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత సురేశ్‌ ఇంటిపైనా ఎన్‌ఐఏ దాడి చేసింది. సురేశ్‌తోపాటు ఆయన బంధుమిత్రుల ఇండ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, రిక్రూట్‌మెంట్‌కు సహాయసహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed