- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభమైన వెంటనే జరిగేది ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. శాసనసభ ముందుకు పలు పత్రాల బిల్లులు రానున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ఈ నెల 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్ డిస్కం, ట్రాన్స్‌కో, టీఎస్ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్ష 2020-21 ఆడిట్ రిపోర్టు, స్టేట్ ఎలక్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు.
సభ ముందుకు ఏడు బిల్లులు
శాసనసభలో ఏడు బిల్లులు రానున్నాయి. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు-2022, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు-2022, తెలంగాణ మున్సిపల్ చట్టాలు-2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు, తెలంగాణ ఫారెస్టు యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ మోటారు వాహనాల టాక్సేషన్ సవరణ బిల్లులకు సంబంధించి పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు అందజేయనున్నారు. ఉభయ సభల్లో కేంద్ర ఎలక్ట్రిసిటీ బిల్లు- పర్యావసానాల అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది.
Also Read: 'కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తోంది'
Also Read: ఈటలపై వేటుకు ప్లాన్? అసెంబ్లీ మొదలుకాగానే సస్పెన్షన్?