Assembly : అసెంబ్లీ సమావేశాలు ముగిసేది ఎప్పుడంటే..?

by Sathputhe Rajesh |
Assembly : అసెంబ్లీ సమావేశాలు ముగిసేది ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తొలి రోజు శాసనసభ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. అనంతరం బీఏసీ నిర్ణయాలను సభ ముందు సీఎం రేవంత్ రెడ్డి ఉంచారు. ఆగస్టు 2వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 26న అసెంబ్లీకి సెలవు ఉండనుంది. ఈ నెల 27న బడ్జెట్ పద్దుపై చర్చించనున్నారు. 28న ఆదివారం అసెంబ్లీ సెలవు ఉండగా.. ఈ నెల 29, 30 తేదీల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈనెల 31న రాష్ట్ర అప్రాప్రియేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 1,2 తేదీల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.



Next Story

Most Viewed