Asaduddin Owaisi తిరుమల ఏమైనా మీ జాగీరా... అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-03 14:16:43.0  )
Asaduddin Owaisi తిరుమల ఏమైనా మీ జాగీరా... అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ బోర్డు చైర్మన్‌ (TTD Board Chairman)గా బీఆర్ నాయుడు (BR Naidu) బాధ్యతలు చేపట్టక ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా సృష్టిస్తున్నాయి. తిరుమల (Tirumala)లో విధులు నిర్వర్తిస్తున్న అన్యమతస్తులను వీఆర్ఎస్ (VRS) ఇచ్చి పంపుతామని, ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆయన కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ నాయుడు (BR Naidu) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు (TTD Board)లోని 24 మంది సభ్యుల్లో అందరూ హిందువులే ఉండాలని, అదేవిధంగా ఆలయంలో పనిచేసే వాళ్లలో అన్యమతస్తులు ఉండకూడదంటూ టీటీడీ బోర్డు చైర్మన్ (TTD Board Chairman) స్టేట్‌మెంట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు.

బీఆర్ నాయుడు (BR Naidu) వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకమని, తిరుమల ఆయన జాగీరు కాదని ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Government,), వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌ (Wakf Board, Wakf Council)లో ముస్లిమేతరులకు చోటు కల్పిస్తూ బిల్లు రూపొందించిందని గుర్తు చేశారు. అసలు హిందువులకు సంబంధం లేని వక్ఫ్ బిల్లులో ఈ నిబంధన ఎందుకు తెస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీటీడీ(TTD)లో పని చేసేందుకు అన్యమతస్తులను ఎలా అయితే నిరాకరిస్తున్నారో.. వక్ఫ్‌ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ బిల్లు (Wakf Board, Wakf Council Bill) విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే వ్యవహిరించాలని ఆయన కామెంట్ చేశారు. దేశంలో హిందువులకు ఒక న్యాయం.. ముస్లింలకు ఓ న్యాయమా అని అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed